పెళ్లి చూపులకు వెళ్లి వస్తు తిరిగిరాని లోకాలకు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
నాగర్కర్నూల్ జిల్లా చారకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన ప్రకారం కల్వకుర్తి మండలం తాండ్రకి చెందిన రామకోటి (32), వెల్దండ మండలం కొట్రకు చెందిన గణేశ్ (34)తో కలిసి పెళ్లి చూపుల కోసం వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వీరి కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈఘటనలో కారు నుజ్జునుజ్జు అయి అందులో ఇరుక్కుని స్పాట్లో చనిపోయారు.పోలీసులు కేసు నమోదు చేశారు.