మెడికేర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులపై ఫిర్యాదు
చేసిన కామారెడ్డి మండలం షాబ్దిపూర్ గ్రామానికి చెందిన అబ్బ గోనీ సిద్ధ గౌడ్. సోమవారం ప్రజావాణిలో మేడికేర్ ఆస్పత్రి వైద్యులపై ఫిర్యాదు
బాధితుని వివరాల ప్రకారం 11 నెల క్రితం రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగిందని దీంతో మెడికల్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో అడ్మిట్ అన్నారు. ఆపరేషన్ చేసి ఎడమ చేతిలో రాడు వేసి. చికిత్స అందించారు. అనంతరం నెల తిరగకముందే చెయ్యి నొప్పి వేయడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా.. డాక్టర్ కిషోర్ గౌడ్ సర్జరీ చేసాం కదా అందులో స్క్రూ ఊడిపోయిందని తెలిపారు. మళ్లీ మీకు ఆపరేషన్ చేయాలని తెలపడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మళ్లీ ఆరోగ్యశ్రీ ద్వారా రెండవసారి డాక్టర్ ప్రవీణ్ గౌడ్ సర్జన్ ఆపరేషన్ చేసి ప్లేటు మార్చి వైద్యం అందించారు. మళ్లీ అదే విధంగా నొప్పి రావడంతో మళ్లీ వైద్యులను సంప్రదించానన్నారు. మీరు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకున్నారు. ఇప్పుడు మళ్లీ చేయాలంటే మాతో కాదు. వైద్యం చేయడానికి మా ఆసుపత్రిలో పరికరాలు అందుబాటులో లేవని వైద్యులు డాక్టర్ ప్రవీణ్ గౌడ్. డాక్టర్ తిరుపతిరెడ్డి. డాక్టర్ కిషోర్ గౌడ్ బాధితుడు సిద్ధ గౌడ్ కి తెలపడంతో మీరు హైదరాబాదులో వైద్యం చేయించుకోవాలని ప్రతిసారి వైద్యం అందించాలంటే మేము హాస్పటల్ ఉచితంగా నడపడం లేదని వైద్యులు అన్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.