ప్రతిభ కలిగిన క్రీడాకారులకు
ప్రభుత్వప్రోత్సాహం.
తెలంగాణ కెరటం: రాయపోల్ ప్రతినిధి: డిసెంబర్ 12
ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తుందని ఎంపీడీవో బాలయ్య. తాసిల్దార్ దివ్య. మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి
ఎంపీ ఓ శ్రీనివాస్ లు అన్నారు. శుక్రవారం రాయపోల్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సీఎం కఫ్ దినోత్సవాలు ముగింపు సమావేశానికి వారు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని గెలిచినవారు సంతోషంగా ఉంటారని. ఓటమి చెందిన వారు నిరుత్సాహం చెందకుండా గెలుపు కోసం కృషి చేయాలని వారు పేర్కొన్నారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని. చదువుతోపాటు విద్యార్థులు ముందుండాలని వారు పేర్కొన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా. రాష్ట్రస్థాయి వరకు క్రీడాకారులు ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ క్రీడల్లో వాలీబాల్ రాయపోలచ ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుచుకోగా. ద్వితీయ బహుమతి బేగంపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొందారు. కబడ్డీ బాలుర విభాగంలో ప్రథమ కొత్తపల్లి. ద్వితీయ ఎల్కంటి. కొక్కో బాలుర విభాగంలో బేగంపేట ప్రథమ. గొల్లపల్లి ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. బాలికల వాలీబాల్ విభాగంలో బేగంపేట ప్రథమ. రామ్ సాగర్ ద్వితీయ. కబడి విభాగంలో రామారం. ద్వితీయ విభాగంలో బేగంపేట పాఠశాల విద్యార్థులు గెలుపొందారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు. పంచాయతీ కార్యదర్శి శివకుమార్ వివిధ గ్రామాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.