ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లు కారా గారాల కంటే అద్వానంగా మారాయి

ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లు కారా గారాల కంటే అద్వానంగా మారాయి

సంవత్సరం గడవకముందే 51 మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న
రేవంత్ సర్కార్ – ఏబీవీపీ

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి

అఖిల భారత విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో గురుకుల, సంక్షేమ హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కోకన్వీనర్ పవన్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగించిందో దానికి కొనసాగింపుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు కారాగారాల కంటే అధ్వాన్నంగా మారాయని. అనేక మంది విద్యార్థులు పాము కాటు, ఫుడ్ పాయిజన్, అధికారుల వేధింపులతో మరణిస్తున్నారని ఆయన చెప్పారు, కొన్నిచోట్ల వసతి గృహాలు గురుకులాల భవనాలు శిధిలావస్థలో చేరి భవనాలు ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థులు భయాందోళనలో బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. గత 12 నెలల్లో ప్రభుత్వ వసతి గృహాల్లో 50 మంది విద్యార్థులు చనిపోయిన దాదాపు 3000 మంది విద్యార్థులు ఈ 12 నెలల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని రాష్టంలో గురుకుల సంక్షేమ హాస్టళ్లు చాలావరకు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేక, కొత్తవి నిర్మించక, చెల్లించాల్సిన అద్దె బకాయిలు కోట్లలో ఉన్న ఏడాదికి పైగా అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటూ యజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గురుకుల సంక్షేమ హాస్టల్ బిల్డింగ్ యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా తాళాలు వేసిన ఘటనలు కూడా మనం చూసామని చెప్పారు, ఈ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లలో మరియు వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు కల్పించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రమైన ఉద్యమాలకు రూపకల్పన చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కర్యాసమితి సభ్యులు వివేక్, సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఘనిందర్, నగర కార్యదర్శి పరుశురాం, రాజేష్, పవన్, చందు, చరణ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment