ఆలయ అభివృద్ధి విషయంలో వెనుకాడది లేదు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఆలయ అభివృద్ధి విషయంలో వెనుకాడది లేదు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి జనవరి

ఆలయ అభివృద్ధి విషయంలో వెనుకాడది లేదని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు సోమవారం జగిత్యాల జిల్లావెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు.
మొదటగా కోటిలింగాల లోని శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి వారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దేవాదాయ,ఇరిగేషన్,రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని ఆలయ అభివృద్ధి మరియు ఇతరత్రా అంశాల పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
ఆలయ అభివృద్ధి విషయంలో అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం వహించారాదని,ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు ఏమి ఉన్న వెంటనే పూర్తి చేయాలని ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని,త్రాగునీటి సదుపాయం మరియు మరుగుదొడ్ల నిర్మాణం, వంటివి పూర్తి చేయాలని,వచ్చే భక్తులకు బట్టలు మార్చుకోవడానికి శాశ్వత షేడ్ నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని,మండలానికి సంబంధించిన సాగు నీటికి విషయంలో కూడా రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూడాలని,ఒక ప్రాంతంలో ప్రాజెక్టు ను ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత అభివృద్ధికి సి ఎస్ ఆర్ నిధులను వినియోగించడం జరుగుతుందని,గత ప్రభుత్వ పాలకులు వాటిని పట్టించుకోలేదని,గత ప్రభుత్వంలో దాదాపు 20వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం లింక్ 2 నిర్మాణం ద్వారా ఇక్కడి నీటినీ సిద్దిపేటకి తరలించడం జరిగిందని,మెగా కంపెనీ యాజమాన్యానికి మేము ఒక్కటే సూచిస్తున్నామని ఈ ప్రాంతానికి సంబంధించి ప్రతి రూపాయిని ఇక్కడి అభివృద్ధికే వినియోగించాలని,అదే విధంగా ఈ ప్రాంత పారిశుధ్యం విషయంలో కూడా 2 లక్షల 99 వేల రూపాయల నిధులు మంజూరు అయి ఉన్నాయని మరో 3 లక్షల రూపాయల అవసరం ఉందని అధికారులు చెప్పడం జరుగుతుందని,దానికి నా ఏసి డి పి నిధులనుండి 3 లక్షల రూపాయలను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి వెల్గటూర్ తాజా మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ మెరుగు మురళి గౌడ్ సందీప్ రెడ్డి పెగడపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర రాములు గౌడ్ గుమ్మల వెంకటేశం ఏఎంసి వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి దావుల శశి ధర్మపురి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ధర్మపురి ఆలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్ గండ్ర శ్రీకాంత్ రావు నాయకులు రామ్మోహన్ రావు మెరుగు నరేష్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రమేష్ పాసిగామ మాజీ సర్పంచ్ బొప్పు తిరుపతి కోటిలింగాల మాజీ సర్పంచ్ నక్క మౌనిక రవితేజ బిల్లకూరి తిరుపతి అధికారులు తాసిల్దార్ శేఖర్ ఎంపీ ఓ జక్కుల శ్రీనివాస్ డిటి గంగాధర్ ఆర్ఐ రాజేశ్వరి రాంరెడ్డి అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment