ప్రభుత్వాలు ఎమ్మెల్యే మారిన కల్లు సొసైటీలో

ప్రభుత్వాలు ఎమ్మెల్యే మారిన కల్లు సొసైటీలో

ఆ వర్గాలదే ఆధిపత్య పోరు

కన్నెత్తి చూడని ఎక్స్చేంజి శాఖ
సభ్యులకు బెదిరింపులు.

ప్రార్థన స్థలాల దగ్గర కస్తూర్బా బాలికల పాఠశాల కల్లు తయారీ అమ్మకలు,

 

నష్టపోతున్న గీతకార్మికులు,

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

గీతా కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన మక్తల్ కల్లు సొసైటీ పై ఆధిపత్య పోరు సాగుతోంది. సొసైటీ లో ఉన్న వర్గాల వారు ప్రభుత్వం ఎమ్మెల్యే మారినప్పుడు ఆదిపత్యం మారుతుంది. అధికార పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న కొంతమంది వచ్చే లాభాలపై వర్గం ఆధిపత్యంతో మిగతా సభ్యులకు లాబాలను పంచడం లేదని మక్తల్ మండల కేంద్రంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
ఇదే మని ప్రశస్తె గత ప్రభుత్వంలో మీరు ఆధిపత్యం చెలాయించిన్రు ఇప్పుడు మా ప్రభుత్వం పాలనుంది కాబట్టి మమ్మల్ని అడిగే అధికారం మీకు ఎక్కడిదని అంటున్నారు. మక్తల్ గీత కార్మికుల శ్రేయస్సు కోసం స్థాపించిన సొసైటీలో గతం నుండి రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులదే లాభాలపై

ఆధిపత్యం కొనసాగుతుంది ఆయనకు వత్తాసు పలుకుతున్న సభ్యులనుకు వచ్చిన లాభాలు నెలవారిగా ముట్ట చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల సభ్యుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరగాయి. దీంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రార్థనా స్థలాల పరిసరాలు జనసంచారం మధ్యన కళ్ళు దుకాణాలు ఉన్న ఎక్సైజ్ శాఖ పట్టించు కోవడంలేదు.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం స్థానిక వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో సొసైటీ లో ఉన్న సభ్యులందరికీ పరిచయస్థులే కావడంతో వచ్చిన లాభాలు నెలవారీగా చెల్లించే చర్యలు తీసుకున్నారు.లక్షల్లో వచ్చే ఆదాయంపై కన్నేసిన ఆ వ్యక్తులు సభ్యులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సొసైటీ కి వచ్చిన లాభాలు ఇంకో వర్గానికి నెలవారిగా ఇవ్వడం లేదని ఇచ్చిన సొసైటీ లెక్కలపై స్పష్టమంగా ఇప్పటివరకు చెప్పడం లేదని ఇదేమని అడిగితే అడగడానికి మీరు ఎవరని కింతమంది బెదిరిస్తున్నారని ఇంకో వర్గం వారు అంటున్నారు, మరి ముఖ్యంగా ప్రార్థన స్థలాలు కస్తూర్ బాబు గాంధీ బాలికల పాఠశాల దగ్గర కల్లు తయారీ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నయి,
కొన్ని సంవ త్సరంల క్రితం ఆరంభమైన ఈ సొసైటీ లో ప్రభుత్వ ఉద్యోగులు మినహాయించి మిగతా గీత కార్మికుల ను సభ్యులుగా చేర్చుకొని సొసైటీని కొనసాగిస్తున్నారు.
ఎక్కువగా ఉండడంతో అధికారులు, రాజకీయ నాయకుల జోక్యం కూడా ఈ సొసైటీ పై ఉంటూ వచ్చింది. ఈ సొసైటీ ద్వారా వచ్చే బీద గీత కార్మికుల కుటుంబాలకు కొంతమేర ఉపయోగపడుతూ వస్తుంది. కాగా ఈ సొసైటీలో ఉన్న కొంతమంది ఆధిపత్యాన్ని చాలా ఇస్తూ వచ్చే లాభాలను కొంత మొత్తాన్ని ముఖ్య నేతలకు ఇస్తు న్నామని చెబుతుండడంతో మిగిలిన సభ్యులు నోరు మెదపని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలువురు గీతా కార్మికులు ఇదేమి అన్యాయం. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చూపుతామని హెచ్చరి అన్నంత పని చేశారు.
ఈ ప్రాంతంలో ఎక్కడ ఈత చెట్ల నుండి కల్లు కారేది లేకున్నా ప్రాణాంతమైన అల్పాజోలం.వరి పొలానికి వాడే యూరియాను మిక్స్ చేసి అమాయక పేద ప్రజలకు తాపిస్తూ వారి ప్రాణాలతో సొసైటీ వారు ఆడుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇటీవల చందాపూర్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆల్ఫా జోలం పట్టుకున్న సంఘటన ఉంది, ఇంత పెద్ద మొత్తంలో అక్రమ కల్లు దుకాణాలు ప్రాణాంతకమైన పదార్థాలను కలిపి అమ్ముతున్న ఆప్కారి శాఖ వారు మామూలు మత్తులో జరుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు . ఈ కల్తీ కల్లుకు అలవాటు పడిన వాళ్ళు అనారోగ్యంతో సమయానికి కల్లు అందుకుంటే పిచ్చివారిగామారి ప్రమాదంలో చనిపోయిన సంఘటనలు ఉన్నాయి.

ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలి

సొసైటీ ద్వారా తమకు రావలసిన లాభాలు రావడం లేదని. ఈ విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సభ్యు లందరికీ తగిన న్యాయం చేయాలని గీత కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా సీసా కళ్ళు ధర ఐదు రూపాయలు ఉన్నప్పుడు వచ్చే లాభాలలో తమకు వెయ్యి రూపాయలు వచ్చేవి అని, ఇప్పుడు సీసా ధర 20 రూపాయలకు పెరిగి నప్పటికీని అవే వెయ్యి రూపాయలు ఇస్తున్నారని.ఇదేక్కడి న్యాయం అని గీత కార్మికులు అంటున్నారు. ఇప్ప టికైనా ఎమ్మెల్యే ఈ విషయాలన్నింటినీ పరిశీలించి బీద గీతా కార్మికులకు న్యాయం చేకూర్చాలని ఎక్సెస్ శాఖ నుండి అనుమతులు ఉన్న స్థలాల్లో కల్లు అమ్మకంపెట్టాలని ఎ మతానికి చెందిన వారైనా వారి ప్రార్థన స్థలాలను గౌరవించా లని నిబంధనల మేరకు ప్రార్థన స్థలాల పరిదిలో ఉన్న కల్లు అమ్ముతున్న వాటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల మానప్రాణాలను ఆరోగ్యాలను దెబ్బతీసే కల్తీ కల్లు సొసైటీ పై ఆధిపత్యం చెలాయించే నాయకులను ఏ పార్టీ వారు ఆదరించరాదని. ఎందుకు దిక్కరిస్తే గతంలో మక్తల్ గీతా కార్మిక సొసైటీలో ఆధిపత్యం చెలాయించిన ప్రస్తుతం ఎలా ఉందో కళ్ళార చూస్తున్నారని. ప్రజలు అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment