ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామ దర్బార్:
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు వెల్లడి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావు కొత్త నిర్ణయం తీసుకున్నారు. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామదర్బార్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. త్వరలోనే మెదక్ నియోజకవర్గంలో గ్రామ దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. క్యాంప్ ఆఫీస్ కె పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు వారి సమస్యలను తెలుపుతారని ఆయన అన్నారు. సమస్యలు ఉన్న ప్రజలందరి బాధలను తీర్చడం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు.