ఈ నెల 21 నుండి గ్రామ సభలు
–గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ
–మండల తహశీల్దార్ అరిఫా
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డుల మంజూరి,ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ అన్నారు.మర్కుక్ లో ఏర్పాటు చేసిన బృందాలకు ఎంపీడీవో కార్యాలయంలో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ గురువారం నాడు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ఆర్డీవో మాట్లాడుతూ ఈనెల 16వ తారీకు నుండి 20వ తారీకు వరకు వెరిఫికేషన్ ప్రారంభించాలని,గ్రామాలలో గ్రామసభలు 21 తారీకు నుండి 24వ తారీకు వరకు నిర్వహించి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.గ్రామంలోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలని వారు తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం పట్ల పేదింటి వారికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరు సమయస్ఫూర్తితో,అంకితభావంతో పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ తహశీల్దార్ షేక్ ఆరిఫా,ఇంచార్జ్ ఎంపీడీఓ అశోక్ కుమార్,ఎంఏవో సీహెచ్ అనిల్ కుమార్,మండల ఆర్‌ఐ లు,మండల ఏఈవో లు,మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.