ఘనంగా మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి జనవరి 1
ఉమ్మడి బెజ్జంకి మండల మాజీ ఎంపీపీ, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ జన్మదినం సందర్బంగా సోమవారం రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని పలువురు వృద్ధులకు, అనంతసాగర్ లో గల వృద్దాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. నిరుపేద పిల్లలకు అన్నదానం నిర్వహించి కేక్ కోసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మచ్చకుమార్ మాట్లాడుతూ, మంచికి మారు పేరుగా నిలిచి, అందరి మంచి కోరుకునే ఒగ్గు దామోదర్, రాబోయే రోజుల్లో విజయాలు సాధించాలని, ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంచాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని మచ్చ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో శానగొండ శరత్ కుమార్, జేరిపోతుల మధు, అమరాజు నవీన్, సంపంగి విజయ్ తదితరులు పాల్గొన్నారు.