మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.

మందమర్రి ప్రెస్ క్లబ్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.

 

 

తెలంగాణ కెరటం, జనవరి 01, మందమర్రి

 

మందమర్రి ప్రెస్ క్లబ్లో బుధవారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాండ్ల సంజీవ్, కడారి శ్రీధర్లు కేక్ కట్ చేసి పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరికీ మంచి జరగాలని అందరి కోరికలు ఆశయాలు నెరవేరాలని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ నిరంతరం పాత్రికేయుల హక్కుల కోసం పోరాడుతుందని పాత్రికేయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలువురు పాత్రికేయులు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు,సింగరేణి గుర్తింపు సంఘం నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment