తెలంగాణ తల్లి చిత్రపటానికి అమరవీరుల స్తూపానికి పూలమాలతో ఘనంగా నివాళులు
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి,ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే సుని తా లక్ష్మారెడ్డి
తెలంగాణ కెరటం:మెదక్ జిల్లా బ్యూరో:నవంబర్ 29:
మెదక్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి,నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ లు బట్టి.జగపతి మల్లికార్జున గౌడ్, నాయకులు తిరుపతి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్. కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ అంజనేయులు, బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులతో కలసి’దీక్షా దివాస్’ను ఘనంగా నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి, చిత్రపటానికి అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలాభిషేకం చేశారు, దీక్ష దివాస్ వద్ద ఉద్యమం సమయంలో చేసిన పోరాటాల చిత్రపటాల గ్యాలరీని ప్రారంభించి ఫోటోలను వీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు యం. పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడారని అన్నారు.2009 లో నవంబర్ 29న ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో’ అన్న దృఢ సంకల్పంతో ఆమరణ నిరాహారదీక్షకు నాటి తెలంగాణ ఉద్యమ నేత,నేటి మాజీ సీఎం కేసీఆర్ పూనుకున్న సందర్భాన్ని గుర్తు చేశారు.కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది అన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నాడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి తెగించిన సందర్భాన్ని తెలంగాణ గడ్డ ఎన్నటికీ మర్చిపోలేదన్నారు.
తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా దివాస్ నిలుస్తుందన్నారు. 2009 నవంబర్ 29 వ తేదీన కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని తెలిపారు. ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించిందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసిందన్నారు.దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు బట్టి.జగపతి మల్లికార్జున గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్.కృష్ణారెడ్డి,నాయకులు కంఠ రెడ్డి తిరుపతి రెడ్డి,మాజీ గ్రంధాలయ చైర్మన్ చంద్ర గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్,5 వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు,కో కన్వీనర్లు.కృష్ణగౌడ్ లింగారెడ్డి,జుబేర్ అహ్మద్ ,మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్,భీమరి కిషోర్, జయరాజు,మాజీ కౌన్సిలర్ చంద్రకళ,మెదక్ నర్సాపూర్ నియోజక వర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు,పిఎసిఎస్ చైర్మన్ లు,మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు,సర్పంచులు, ఎంపీటీసీలు,నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.