అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 19;

 

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్(బిజెఆర్)

అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుందని మాజీ మున్సిపల్‌ చైర్మన్ బర్రె జహంగీర్ అన్నారు. భువనగిరి మున్సిపల్ పట్టణ పరిధిలోని 8వ వార్డు సీతానగర్ లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని అధికారులు చేప్పటిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే పనులను పరిశీలించి ఇందిరమ్మ యాప్ లో లబ్దిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి సహాకారంతో మునిసిపల్‌ పరిధిలోని ప్రతి వార్డులో లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ఇందిరమ్మ కమిటీలు వేసినట్లు ఆయన తెలిపారు. సర్వే ఆధారంగా అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తారాని ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందుకు వచ్చిందని, లబ్దిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ అప్లోడ్ అధికారి పాండు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉడత రమేష్, సిరుపంగ నాగరాజ్ గోపి మనమ్మ, కూర నాగేందర్, ఎండి కరీం లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment