దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన మహానేత మన్మోహన్ సింగ్.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 27:
దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన గొప్ప మహనీయులు స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని టీపీసిసి ఎస్సి సెల్ కన్వీనర్ సాల్మన్ రాజ్ కొనియాడారు.శుక్రవారం పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్బంగా సాల్మన్ రాజ్ మాట్లాడుతూ ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. పీవీ నర్సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మన్మోహన్ సింగ్ పూర్తిగా మార్చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా, విలక్షణ పార్లమెంటేరియన్ గా మన్మోహన్ సింగ్ సేవలు అందించారని తెలిపారు. వారి జీవితంలో ఎన్నో కీలక పదవులు అధిష్టించిన ఆయన సామాన్య జీవితం గడిపారన్నారు.మన్మోహన్ సింగ్ నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చి గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారన్నారు. వివిధ ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన ఆయన దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారని ఈ సందర్భంగాఆయన గుర్తుచేశారు. వారు మరణించటం దేశానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలోఅన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోచ ప్రసాద్ సీనియర్ నాయకులు కుమార్ యూత్ కాంగ్రెస్ నాయకులు రవి, మైనారిటీ అధ్యక్షులుఇస్మాయిల్,మహమ్మద్ పాషా, రాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.