జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ 

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ 

 

 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 01 సూర్యాపేట జిల్లాలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో 31st వేడుకలు.సూర్యాపేట జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా ఎస్పి గారు తెలియజేస్తూ, నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ప్రజల భద్రత కొరకు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు ముందస్తుగా జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకునేల కట్టుదిట్టమైన భద్రత పరమైయాన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిసెంబర్ 31 రాత్రి బందోబస్తు నిర్వహించడం జరిగినది.ప్రజలను యువతను ముందస్తుగా అప్రమత్తం చేసి ప్రమాద రహిత వేడుకలను కోవాలని పెద్దలు తల్లిదండ్రులు అందరితో కలిసి సంతోషంగా ఇండ్లలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. డి జె లు, బాణాసంచా, త్రిబుల్ రైడింగ్, బైక్ రేసింగ్ లు, బహిరంగ మధ్యపానం, రోడ్లపై కేక్ కటింగ్ లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే జిల్లాలో ఎలాంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.జిల్లా వ్యాప్తంగా పోలీసులు అర్ధరాత్రి దాటే వరకు విస్తృతంగా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించారు. పోలీసు వారు చూసినలు ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిపై డిశంబర్ 31 రాత్రి సుమారు 800 లకు పైగా మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. తాగి వాహనాలు నడుపుతున్న 200 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. అమర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 89 వాహనాలపై కేసులు చేయడం జరిగినది.ఉత్సవం, వేడుకలు ఏవైనా ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా సంతోషంగా జరుపుకోవాలని ప్రమాదాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment