రైతులకు ఇబ్బంది చేస్తే సహించేది లేదు
–మల్లన్న సాగర్ తోని రైతులకు జీవనాధారం.
–యాసంగి సాగుకు
నీరు అందించాలి.
-కాల్వల్లో కూడిక తీసి నీరు పారించాలి.
-దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
తెలంగాణ కెరటం: రాయపోల్ ప్రతినిధి :డిసెంబర్ 29
మల్లన్న సాగర్ ప్రాజెక్టు తోనే రైతులకు జీవనాధారం అని ప్రభుత్వం స్పందించి కాలువల్లో కూడిక ఇక పనులు చేపట్టి యాసంగి సాగు కోసం కాల్వాల ద్వారా అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మంతూర్ గ్రామం చెందిన బిఆర్ఎస్ కార్యకర్త చంద్రం కుమారుని నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతును రాజును చేయాలని లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు చేపట్టి వాటి ద్వారా కాలువలు నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం సిగ్గుచేటు అన్నారు. మల్లన్న సాగర్ కొండ పోచమ్మ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగానికి నీరు అందిస్తే సస్యశ్యామలం అవుతుందని ఆయన గుర్తు చేశారు. పక్కనే ఉన్న ప్రాజెక్టు ద్వారా అందించలేని ప్రభుత్వం మళ్లీ రైతులు నీటి కోసం బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. కాల్వల్లో పేరుకుపోయిన పూడిక తీసి వెంటనే పంటలకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం. అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రతి వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదని. రైతుబంధు లేకపోవడంతో రైతులు వ్యవసాయ పనుల కోసం అనేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను గాలికి వదిలేసి ఇష్ట రాజ్యాంగ వ్యవరించడంతో పేద ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే మల్లన్న సాగర్. కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా యాసంగి పంటల సాగుకు నీరు అందించాలని లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ.మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి.బిఆర్ఎస్ యువజన నాయకులు రాజిరెడ్డి. దయాకర్, మాజీ కోఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్, యూత్ నాయకుడు శ్రీధర్, భార్గవ్, సంతోష్ తదితరులు ఉన్నారు.