కృషి.. పట్టుదల.. అత్మ విశ్వాసం.. అతడ్ని ‘ఉన్నత శిఖరాన నిలిపాయి’
- శాతవాహన యూనివర్సిటీకి రిజిస్ట్రార్ ఖమ్మం వాసి రవికుమార్
కృషి పట్టుదల, అత్మ విశ్వాసం శ్రమకు తోడైతే ఎలాంటి పరిస్థితినైనా అధిగ మించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ని రూపించాడు.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండ లంలోని గోపవరం గ్రామంలో పురుషోత్తమ, నాగరత్నమ్మ దంపతుల చిన్న కుమారుడు రవికుమార్. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూనే తమ కుమారుడ్ని చదివించారు. తన గురువుల ప్రోత్సాహం.., స్నేహితుల సహకారం తాను ఈ స్థాయికి రావడానికి దోహదపడ్డాయి. ఇప్పుడతను కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా నియమితులయ్యారు.
ఖమ్మం జిల్లా ప్రతినిధి, జనవరి 06 (తెలంగాణ కెరటం): కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయానికి ఖమ్మం జిల్లా వాసి జి.రవికుమార్ రిజిస్ట్రార్ గా నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని గ్రామీణ ప్రాంతం గోపవరం గ్రామంలో పురుషోత్తమ, నాగరత్నమ్మ దంపతులకు చిన్న కుమారుడు రవికుమార్. కామర్స్ సబ్జెక్ట్ ను ఇష్టపడే రవికుమార్ చిన్నప్పటినుండి విద్య లో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ… ప్రస్తుతం ఉన్నత శిఖరాన్ని అధిరోహించాడు. తల్లితండ్రుల, గ్రామ వాసుల, తోటి స్నేహితుల ప్రోత్సాహం, తన గురువు నరసింహారావు మాస్టర్ అందించిన సహకారం రవికుమార్ గమ్యాన్ని, గమనాన్ని నిర్దేశించిన.. ఫలితం శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా నియామకం. ఇంటర్ డిగ్రీ స్థాయిలో రవికుమార్ ట్యూషన్ బ్యాచ్ మాస్టర్ నరసింహారావు ప్రత్యేక శ్రద్ధ తో కామర్స్ సబ్జెక్టులో పోటీలు పెట్టేవారు. వీరంతా అందులో పోటీ పడేవారు. ఎం కామ్, ఎంబీఏ, పి హెచ్ డి చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా, ఎగ్జామినేషన్ బ్రాంచ్ అడిషనల్ కంట్రోలర్ గా, డిఫెన్స్ ఎడ్యుకేషనల్ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించిన తదనంతరం శాతవాహన విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా రవికుమార్ నియమితులైన సందర్భంగా గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఖమ్మం స్టడీ సర్కిల్ లో ఇంటర్ డిగ్రీ స్థాయిలలో ట్యూషన్ బ్యాచ్ మిత్రులు, తోటి విద్యార్థులైన ఎస్. నాగేశ్వరరావు, శ్రీనివాస్, మురళీకృష్ణ ,వెంకన్న ,విద్యాసాగర్, మాధవి, లత, వాసవి, సూర్యనారాయణ, సాంబశివరావు, రాజేందర్, శ్రీకాంత్, రంగారావు, మంజు, లింగమూర్తి, హేమంత్, గన్నవరపు వెంకటేశ్వర్లు, తారక్ నాథ్, పూర్ణ లను రవికుమార్ గుర్తు చేసుకున్నారు. ఇలా ఉండగా తన విద్యార్థి రవికుమార్ రిజిస్ట్రార్ గా అర్హత సాధించడం ఖమ్మం స్టడీ సర్కిల్ అధినేత నరసింహారావు అభినందనలు ప్రకటించారు.