*నేల సంరక్షణతో అధిక దిగుబడులు*
*సహాయ వ్యవసాయ సంచాలకుడు రాజ్ నారాయణ*
తెలంగాణ కెరట ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 24:
పంట దిగుబడిలో నేల సంరక్షణ మరియు నేల ఆరోగ్యంలో బయో చార్ పంట వ్యర్ధాలను కాల్చకపోవడం వాటిని కలియ దున్నడం కీలక పాత్ర పోషిస్తుందని ఈ అంశాలపై మంగళవారం రైతు వేదిక రామాయంపేట నందు వీడియోకాన్ఫరెన్స్ విధానం ద్వారా వ్యవసాయ అధికారులకు మరియు రైతులకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం,వ్యవసాయ శాఖ రాష్ట్ర అధికారుల ఆధ్వర్యంలో సాంకేతిక పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు మరియు పంట వ్యర్ధాలను నేలలో కలియ దున్నడం వల్ల జరిగేటువంటి లాభాల గూర్చి రైతులకు వ్యవసాయ పరిశోధన స్థానం రాజేంద్రనగర్ శాస్త్రవేత్త శంకరయ్య రైతులకు వివరించడం జరిగింది
ముఖ్యంగా పంట వ్యర్ధాలను కాల్చడం ద్వారా పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు మరియు వానపాముల సంతతి అంతరించిపోతుందని దీని ద్వారా సేంద్రియకర్భన పదార్థం తగ్గి పంట దిగుబడులపై తీవ్ర దుష్ప్రభావాలు ఉన్నాయని కావున రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయంగా వీటిని నేలలో కలియ దున్నడం ద్వారా సేంద్రియ కర్భన పదార్థాన్ని పెంచే అవకాశం ఉందని సేంద్రియ కర్భాన పదార్థం పెరగడం ద్వారా పంటల దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కావున రైతులు పంట వ్యర్ధాలను నేలలో కలియదున్నాలని సూచించారు చలికాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న నేపథ్యంలో నేలలో పంట వ్యర్ధాలను కలియదున్నినప్పుడు కుళ్ళిపోయే ప్రక్రియ అతి నెమ్మదిగా జరుగుతుందని దీనికోసం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులు ఎకరాకు 50 కేజీలు లేదా వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో రెండు కేజీల బెల్లం కలిపి వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని వారం పాటు మాగబెట్టి నేలలో కలిపి దున్ని నట్లయితే కుల్లింపజేసే ప్రక్రియను వేగవంతం చేయవచ్చని తెలిపారు.నేల సంరక్షణలో ఉపయోగపడే పదార్థం బయోచార్,బయోచార్ అనగా ఆక్సిజన్ లేకుండా లేదా తక్కువ ఆక్సిజన్ ఉపయోగించి పంట వ్యర్ధాలను కలపను బొగ్గుగా మార్చే ప్రక్రియనే బయో చార్ అంటారు ఇది నేలకు అందించడం ద్వారా నేలలోని వ్యర్ధ పదార్థాలను హానికారక రసాయనాలను తొలగించి వేసే అవకాశం ఉంది బయోచారుకు జీవన ఎరువులను కలిపి వాడుకున్నట్లయితే నేల ఆరోగ్యం పెంపొందే అవకాశముంది. వాతావరణం లోని హానికారక వాయువులను ఇది పీల్చుకునే అవకాశం ఉంది నేలలోని ఉదజని సూచికలు నీటి నిలుపుకునే శక్తిని పెంచుతుంది పోషకాల సమతుల్యతను పెంచే అవకాశం ఉంది ఇన్ని లాభాలు ఉన్నటువంటి బయోచార్ తయారీ మరియు వాటి ఉపయోగాలు గూర్చి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుందని ప్రముఖ శాస్త్రవేత్త నక్క సాయి భాస్కర్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణతో పాటుగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీనివాస్ సాయి కృష్ణ సందీప్ ప్రవీణ్ రైతులు పాల్గొనడం జరిగింది.