విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేసిన హెచ్ఎం
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 29
బొమ్రాస్పేట్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలనులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పౌష్టికాహార మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో ప్రతిరోజు కమిటీ సభ్యులు భోజనం చేయాలి అని నిబంధనలో భాగంగా విద్యార్థులతోపాటు కలసి భోజనం చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరారం గోపాల్. అనంతరం ఏజెన్సీ జెమినీ భాయ్ కి వివరిస్తూ నాణ్యత ప్రమాణాలను పాటించాలని మెనూ ప్రకారంగా విద్యార్థులకు సరఫరా చేయాలని తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజు పాఠశాలను మరియు అంగన్వాడిని, ఫుడ్ సేఫ్టీ అధికారులు సందర్శించడం జరుగుతుందని అన్నారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటు లో తప్పకుండా మేము పాటించి, విద్యార్థులకు సరఫరా చేయాలని లేనిపక్షంలో అధికారుల ఆదేశానుసారం తల్లిదండ్రుల కమిటీ సమావేశం ఏర్పరచి, క్రమశిక్షణ చర్యలతోపాటు నూతన ఏజెన్సీ ఎన్నుకుంటామని తెలియజేశారు….