హోమ్ మంత్రి అమిత్ షాను తక్షణమే భర్తరఫ్ చేయాలి,

హోమ్ మంత్రి అమిత్ షాను తక్షణమే భర్తరఫ్ చేయాలి,

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 19;

 

అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ నిరసన తెలిపి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఎస్పీ!*

 

బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బాసాని మహేందర్,

పార్లమెంటులో అంబేద్కర్ గారిని అవమాన పరిచిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను తక్షణమే మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బాసాని మహేందర్ డిమాండ్ చేశారు.గురువారం యాదాద్రి జిల్లా హెడ్ కోటర్ భువనగిరి కేంద్రంలోని అంబేద్కర్ గారి స్టాచు దగ్గర అమిత్ శా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీఎస్పీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చాయ్ అమ్మే వ్యక్తిని కూడా ప్రధానమంత్రిగా చేసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నదని గుర్తు చేశారు.దేశంలోని బహుజన కులాలకు అంబేద్కరే అసలైన దేవుడన్నారు.అంబేద్కర్ గారిని అవమాన పర్చడం అంటే దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలను అవమానపరచడమే అన్నారు. బాబా సాహెబ్ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని అది పార్లమెంటు సాక్షిగా బయటపడిందన్నారు.

అంబేద్కర్ భిక్షతో అమిత్ శా హోమ్ మంత్రి అయ్యాడని ఈ విషయం అమిత్ షా గుర్తు పెట్టుకోవాలన్నారు.బాబా సాహెబ్ జోలికి వస్తే కబర్ధార్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యాదాద్రి జిల్లా ఇన్చార్జి గనమల లింగస్వామి గారు మాట్లాడుతూ వెంటనే దేశ ప్రజలకు అమిత్ శా క్షమాపణ చెప్పి మంత్రి పదవి నుండి తప్పుకోవాలన్నారు

ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం వీరస్వామి, జిల్లా కోశాధికారి సర్ల బిక్షపతి, భువనగిరి అసెంబ్లీ ఇన్చార్జి గుండు కృష్ణ గౌడ్, ఆలేరు అసెంబ్లీ ఇన్చార్జ్ మొరుగడి శ్రీశైలం గౌడ్, భువనగిరి అసెంబ్లీ కోశాధికారి బండారు జహంగీర్, భువనగిరి అసెంబ్లీ బీ వి ఎఫ్ కన్వీనర్ సిలువేరు మహేందర్,బీబీనగర్ మండల అధ్యక్షులు రాంపల్లి నర్సింగరావు, మోటకొండూరు మండల అధ్యక్షులు బోట్ల నరేష్,భువనగిరి టౌన్ ఇంచార్జ్ వెంకటేష్ యాదవ్, బోనగిరి టౌన్ అధ్యక్షుడు బర్రె నాగేష్, వలిగొండ మండల ప్రధాన కార్యదర్శి చేగురి అజయ్, బొమ్మలరామారం మండల నాయకులు బూరుగుపల్లి ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకులు ఆడెపు ఉపేందర్,నరేష్, చాట్ల శివ, గోపి క్రాంతి, సిలువేరు వినయ్, బుగ్గ ఏలేష్, రామ్ చరణ్,సాయి,తదితరులు పాల్గొన్నారు,

Join WhatsApp

Join Now

Leave a Comment