హోం మంత్రి అమిత్ షా వైఖరి రాజ్యాంగ విరుద్ధం
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21. అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరి రాజ్యాంగ విరుద్ధమని అతనిని వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ డిమాండ్ చేశారుశనివారం జిల్లా కేంద్రంలో కామ్రేడ్ ధర్మ బిక్షం భవన్ సిపిఐ జిల్లా ఆఫీస్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. అంబేద్కర్ పేరును పలకటం ఫ్యాషన్ కాదని అది సమానత్వం, స్వాతంత్రం సామాజిక మార్పు కోసం జరిగిన విప్లవానికి ప్రతీక అని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక దేశంలో హిందూ మతోన్మాదంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని, అదేవిధంగా దాని ఆనవాలు లేకుండా చేయాలని అనేక ఎత్తుగడలు వేస్తూ ఏదో ఒక రూపంలో దళితులను మైనార్టీలను ప్రశ్నించే వాళ్లను అణిచివేస్తూ హిందుత్వ విధానాలను అమలు చేస్తుందని అన్నారు. దళితులు బడుగు బలహీన వర్గాలు నేడు దేశంలో స్వేచ్ఛ వాయువులను పిలుస్తుందంటే కేవలం అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కు తప్ప ఏ దేవుడు ఇచ్చింది కాదని అన్నారు. ఎన్నికల ముందు అంబేద్కర్ పేరు జపం చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి నేడు అంబేద్కర్ పేరు ఎత్తకూడదని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. బిజెపి ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషించడానికి అనుసరిస్తున్న విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. లేకపోతే రాబోయే కాలంలో దళిత, బహుజనులు, మైనార్టీలు,ప్రశ్నించే వారు పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బూర వెంకటేశ్వర్లు, తిరుమల మండల కార్యదర్శి ఖమ్మం పాటీ రాము, పట్టణ కార్యవర్గ సభ్యులు రెగ్గటి లింగయ్య, ఎండి పాషా, నాయకులు పొదిల లింగయ్య, ఐతరాజు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.