---Advertisement---

చదువుల్లో రాణిస్తే ఉజ్వల భవిత ఉంటుంది.

---Advertisement---

జిల్లా కలెక్టర్ బాదావత్
సంతోష్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి బిసి బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో రాణిస్తేనే భవిష్యత్తులో ఉజ్వల భవిత అందుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకొని చదువుల్లో రాణించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.
తరగతి గదులు, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను, వంట వండే పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని, చదువుకుంటేనే భవిష్యత్తులో ఉజ్వల భవిత అందుతుందని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. మోను ప్రకారం భోజనం అందించాలన్నారు.
గురుకులానికి వచ్చే బియ్యాన్ని ముందుగానే పరిశీలించి నాణ్యతగా ఉంటేనే తీసుకోవాలని, బియ్యంలో పురుగులు, రాళ్లు ఉంటే వెంటనే తిరిగి పంపించాలని సిబ్బందిని ఆదేశించారు.విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాలని సూచించారు.
నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
రానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషి చేయాలన్నారు.
కలెక్టర్ వెంట తెలకపల్లి తహసిల్దార్ జాకీర్ అలీ, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment