లగచర్ల రైతన్నలపై అక్రమ కేసులు ఎత్తివేయాలి.

లగచర్ల రైతన్నలపై అక్రమ కేసులు ఎత్తివేయాలి.

రైతులను బేడీలు వేసి తీసుకెళ్లడం అమానుషం.

తెలంగాణ కెరటం అచ్చంపేట 

లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా, రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు మనోహర్ ప్రసాద్, రమేష్ రావు, పార్టీ నాయకులు అమీనోద్దీన్, బండపల్లి వెంకటయ్య, శంకర్ మాదిగ, మాధవాచారి, గాలిగూటి జగదీష్, అజ్జు, రవినాయక్, దేవా, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment