లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.*

*లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.*

 

తెలంగాణ కెరటం ప్రతినిధి కొడిమ్యాల డిసెంబర్

 

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకుకొడిమ్యాల టిఆర్ఎస్ పార్టీ మండల పక్షాన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం అందజేసిన కొడిమ్యాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు లగచర్ల రైతులపై కాంగ్రేస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్ళలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాలను నిరసిస్తూ లగచర్ల రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో   బి ఆర్ ఎస్  మండల పార్టీ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, యువజన విభాగం మండల అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు సల్మాన్, సింగిల్ విండో డైరెక్టర్ పర్లపల్లి ఆనందం,పార్టీ ఉపాధ్యక్షులు పర్లపల్లి ప్రభుదాస్, మాజీ ఉప సర్పంచ్ లు, అబ్దుల్ శుకూర్, బైరివెంకటి,యువ నాయకులు రాచకొండ చంద్రమోహన్,రామంచ లక్ష్మణ్, కంచర్ల మనోజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment