నర్సాపూర్ నియోజకవర్గంలో దళితులను వీడని దరిద్రం

నర్సాపూర్ నియోజకవర్గంలో దళితులను వీడని దరిద్రం

దళితులకు రాజకీయపరంగా నియోజకవర్గస్థాయిలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్

ఇప్పటికైనా నామినేటెడ్ పదవులు దక్కేనా

బీఎస్పీ కుత్తడి నర్సింలు

తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి

1951న ఏర్పడిన నర్సాపూర్ నియోజకవర్గంలో నాటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో దళితులకు, అగ్రవర్ణాల నాయకులు అన్యాయం చేస్తూనే ఉన్నారని నియోజకవర్గ దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గ జనాభాలో 35% దళితులు ఉన్న రాజకీయ పదవుల్లో మాత్రం ఎప్పటికీ దళితులకు నిరాశే మిగిలింది. నాటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న, దళితుల రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్న పదవులు దక్కడంలో మాత్రం మోండి చెయ్యి చూపుతున్నారు.
ప్రభుత్వాలు ఏవైనా దళిత ఓటర్లను, నాయకులను తమ వెంట తిప్పుకొని జెండాలు భుజానవేసుకొని వెట్టిచాకిరి చేయడం దళితుల వంతు అయింది. పార్టీలు ఏవైనా పార్టీలకు, పార్టీ నాయకులకు నిస్వార్థంతో సేవ చేయడం దళితుల దురదుష్టకర శాపమేమో. ఎంతచేసినా వారికి మాత్రం ఎలాంటి పదవులు వరించకపోవడం బాధాకరం.

ప్రభుత్వాలు రిజర్వేషన్ ప్రకారం పదవులు కల్పించిన స్థానిక నాయకత్వం మాత్రం అగ్రవర్ణాలను ప్రోత్సహించి దళిత నాయకులకు అన్యాయం చేస్తున్నారు.

గతంలో కౌడిపల్లి మండలంలో దళితులకు అధ్యక్ష పదవి రిజర్వేషన్ వచ్చిన స్థానిక నాయకత్వం చొరవతో అగ్రవర్ణాలకు ఇవ్వడం జరిగింది.

నర్సాపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దళిత నాయకులకు ఒక మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఆత్మ కమిటీ అధ్యక్షులు,జడ్పిటిసిలు,ఎంపీపీలు ఇలాంటి పదవులు కల్పించినట్టు చరిత్ర లేదు.

ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాల మండల అధ్యక్షులు అగ్రవర్ణాలకు చెందినవారే. పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా దళితులకు ఎలాంటి పదవులు కట్టబెట్టడ లేదు.
అటు బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఏవైనా దళితులను పార్టీ జెండాలు మోయడానికి, నాయకులను వారి అవసరాలకు తిప్పుకుంటూ దళితులు ఆత్మగౌరాన్ని దెబ్బతీస్తున్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల కోసం ఇకనైనా పారదర్శకంగా ఆలోచిస్తుందని దళితసంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక నాయకత్వం దళిత నాయకులకు రాజకీయ పదవులలో సముచిత స్థానం కల్పించాలని గ్రామీణ ప్రాంత దళిత సంఘాల నాయకులు చర్చించుకోవడమే కాకుండా జిల్లాస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నామినేటేడ్ పదవులను కేటాయించాలని కుత్తడి నరసింహులు డిమాండ్ చేస్తున్నారు . దళితులకు అన్యాయం చేసిన, తమ పట్ల చిన్నచూపు చూసిన స్థానిక ఎన్నికల్లో తమ సత్తాచాటుతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment