ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 48 అర్జీలను స్వీకరించారు.

ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 48 అర్జీలను స్వీకరించారు.

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి

వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ తో కలసి స్వీకరించారు.
సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 48 అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 35, జిల్లా పంచాయతీ శాఖ 6, హౌసింగ్ 3,మున్సిపాలిటీ, రోడ్లు, భవనాలు ఎక్సైజ్, పరిశ్రమలు ఒక్కొకటి చొప్పున వచ్చాయి.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment