అచ్చంపేట ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో
గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 14):
అచ్చంపేట పట్టణంలో గత వారం రోజుల నుండి కొనసాగుతున్న సి వి కే అచ్చంపేట ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో గెలుపొందిన విన్నర్స్ రన్నర్స్ మొదటి బహుమతి ప్రైజ్. వెంకట్ బిల్డర్స్ రెండవ బహుమతి ఆనంద్ గౌడ్ లకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క్రీడాకారులను మరింతగా రాణించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని నల్లమల ప్రాంతంలో క్రీడాకారులకు పుట్టినిల్లు అయినటువంటి ఈ అచ్చంపేట క్రీడాకారులకు అన్ని రకాల సకల సదుపాయాల వసతులతో కూడిన క్రీడా స్థలాలు మినీ స్టేడియాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.అచ్చంపేట పట్టణంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో కొద్ది రోజుల్లో 10 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియంగా రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియంగా మార్చడం జరుగుతుందని అన్నారు.క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ చైర్మన్ మల్లేష్, ఉమామహేశ్వర చైర్మన్ మాధవరెడ్డి ,గోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి రామనాథం, రఘురాం, చంద్రమోహన్ ఖాదర్, మరియు మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.