---Advertisement---

వేల్పూర్ లో హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని శవయాత్ర దిష్టిబొమ్మ దహనం

---Advertisement---

వేల్పూర్ లో హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని శవయాత్ర దిష్టిబొమ్మ దహనం

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 21 :

ఒక రాజ్యాంగబద్ధమైన హోంమంత్రి పదవిలో ఉండి భారత పార్లమెంటు సాక్షిగా ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అమిత్ షా చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం రోజున వేల్పూర్ మాల సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా శవయాత్రను నిర్వహించి, మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. అనంతరం ఈ ర్యాలీ నీ ఉద్దేశిస్తూ వేల్పూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు డాక్టర్ స్వామి రావు మాట్లాడుతూ అమిత్ షా ను హోంమంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదుల నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం, అంబేద్కర్ యువజన సంఘం, మైనారిటీ సంఘం మరియు వేల్పూర్ గ్రామంలోని వివిధ యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment