14న కురుమల ఆత్మగౌరవ భవనం ప్రారంభోత్సవం
తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 13
కోకాపేటలో ఈ నెల 14న దొడ్డి కొమరయ్య కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం ఉన్నట్టు నారాయణఖేడ్ కురుమ సంఘం బాధ్యులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు పోస్టర్ ఆవిష్కరించారు. దొడ్డి కొమరయ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరవుతారని తెలిపారు. నారాయణఖేడ్ నుండి కురుమలు అధిక సంఖ్యలో ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరారు.