కమ్మర్ పల్లి లో యశోబుద్ధ ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి జనవరి
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజు యశోబుద్ధ ఫౌండేషన్ బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (తెలంగాణ) క్యాలెండర్ ఆవిష్కరణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజన సంగం అధ్యక్షుడు సుంకరి విజయ్ మాట్లాడుతూ భారత దేశ ప్రజలు తథాగత్ బుద్ధుడు మరియు మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ ,మహాత్మా జ్యోతిరావుఫూలే ఆలోచన విధానంలో వారి అడుగు జడల్లో జీవన శైలి కొనసాగించాలని యశోబుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఫౌండేషన్ వారి యొక్క సంకల్పం చాలా గొప్పది,వారు ఆశించిన విదంగా మహనీయుల ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు కొనసాగుతామని అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తెలపడం జరిగింది ..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య యశో బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ వ్యవస్థాపక సభ్యులు రవీందర్ రత్నం ,శంకర్ ,అంబేద్కర్ మండల యువజన సంఘం అధ్యక్షుడు, సుంకరి విజయ్, కన్వీనర్ నిమ్మ ప్రసాద్,లెక్చరర్ సాయన్న,క్రియాశీల కార్యదర్శి గుర్రం నరేష్ కార్యదర్శి నరేందర్, సన్నీ, ఉప సర్పంచ్ గంగారం,శైలేందర్,వినయ్ ,రాకేష్ ,ఆంజనేయులు,శ్రీధర్,అశోక్ మరియు వివిధ గ్రామాల అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.