జిల్లాలోని 157 రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెరిగిన డైట్ చార్జీలు.
సంక్షేమ హాస్టల్లో అట్టహాసంగా కామన్ డైట్ ప్లాన్ ప్రారంభం.
డైట్ మెనో చార్ట్ బుక్ లెట్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ.
తెలంగాణ కెరటం నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 14):
జిల్లాలోని 157 రెసిడెన్షియల్ పాఠశాలలో పెరిగిన డైట్ చార్జీలు, సంక్షేమ హాస్టళ్లలో అట్టహాసంగా కామన్ డైట్ ప్లాన్ ప్రారంభమైంది నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిరావు పూలే బిసి బాలికల వసంత గృహాన్ని శనివారం జిల్లా ఎస్పీ గైక్వార్డు వైభవ్ రఘునాథ్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ పర్యవేక్షించారు ఈ నేపథ్యంలో విద్యార్థులు జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు,
విద్యార్థుల చదువు,ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని జిల్లా కలెక్టర్ తెలిపారు,డైట్ మెనూచాట్ బుక్ లెట్ ను ఆవిష్కరించిన, జిల్లా ఎస్పీ ,కలెక్టర్,
అలరించిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు,
మహాత్మ జ్యోతి రావు ఫూలే బిసి బాలికల వసతి గృహాంలో కామన్ డైట్ ప్లాన్ లాంఛనంగా జిల్లా ఎస్పీ ,కలెక్టర్,
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కలసి ప్రారంభించారు. జిల్లా
రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ ను ప్రవేశపెట్టగా జిల్లాల్లోని వివిధ వసతి గృహాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు భాగంగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతి రావు ఫూలే బిసి బాలికల వసతి గృహాం లో కామన్ డైట్ ప్లాన్ ను లాంఛనంగా ప్రారంభించారు.అంతకుముందు పాఠశాలలోని స్టోర్ రూం ను సందర్శించి, కూరగాయలు, సరుకులు, ఆహార పదార్థాలను పరిశీలించారు. సన్నబియ్యం, విజయ డెయిరీ పాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వపరంగా ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్ లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు పరిశీలించారు. లైబ్రరీలో అందుబాటులో ఉంచిన పుస్తకాలను, హెల్త్ కేర్ రూమ్ లో సదుపాయాలు, ఔషధాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 157 రెసిడెన్షియల్ పాఠశాలలో పెరిగిన డైట్ చార్జీలు ,8 సంవత్సరాల తర్వాత డైట్ చార్జెస్ , కాస్మోటిక్ చార్జెస్,40 శాతం పెరిగాయని తద్వారా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించే దిశగా ఈరోజు నుంచి కొత్త డైట్ ప్లాన్ ప్రారంభమవుతుందని తెలియజేశారు. పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందాలని, వారు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పెరిగిన డైట్ చార్జీలను తెలియజేయగాతల్లిదండ్రులు , విద్యార్థులు ఆనందంతో హార్షద్వనాలు చేశారు. విద్యార్థులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉద్బోధించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిందని తెలిపారు. గణితం, ఆంగ్లం సబ్జెక్టులు అంటే భయాన్ని విడనాడాలని, పాఠాలు అర్ధం కాకపోతే సంకోచించకుండా ఉపాధ్యాయులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరి చేరనివ్వకుండా ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేయాలని, గురువులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదిగినా, తల్లిదండ్రులను మర్చిపోకుండా వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను ఇకనుండి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారని కొత్త డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? పరిశుభ్రతను పాటిస్తూ నాణ్యమైన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారా లేదా అన్నది పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు.జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ మంచిగా చదివి ఉన్నత స్థానంలో స్థిరపడాలని సూచించారు.ఈ సమావేశంలో పాఠశాల, ప్రిన్సిపల్ లలిత కుమారి పాఠశాల యొక్క ప్రగతిని తెలియజేశారు. ఐదు ఎకరాలలో 700 మంది విద్యార్థులతో తమ పాఠశాల కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విజ్ఞానజ్యోతికి తమ పాఠశాల నుండి 40 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఇస్తున్నట్లు తెలియజేశారు. తమ పాఠశాల గత సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిందని, తెలియజేశారు.అనంతరం జిల్లా ఎస్పీతో కలిసి విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలుఅలరింపజేశాయిఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ డి.ఎస్.పి శ్రీనివాసులు,తహసిల్దార్ తబితా రాణి , ఉపాధ్యాయులు అధిక మొత్తంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలను, 200 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందన్నారు.