రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి 

రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి 

డిబిఎఫ్ రాష్ట్రకార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి

గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం అన్యాయమని గజ్వేల్ నుండి ప్రకటనలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎకరంలోపు భూమి ఉన్న రైతులు తెలంగాణలో 24.57 లక్షల మంది ఉన్నారన్నారు.ఎకరం లొపు 5 గుంటలు 10 గుంటల వారికి రైతులుగా పరిగణిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు అనర్హులుగా పరిగణిస్తే దాదాపు 24 లక్షల కుటుంబాలకు అన్యాయం జరుగే అవకాశమున్నది కాబట్టి ఎకరం లొపు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్థింపచేసి కోతలు లేకుండ రైతు కూలీలందరికీ 12 వేలు ఇవ్వాలన్నారు.ఉపాధి హమీ లో కనీసం 20 పనిదినాలు ఉండాలనే నిబంధన వలన చాలా మంది నష్టపొయో ప్రమాదం ఉందన్నారు.60 సంవత్సరాలు నిండిన వారు ఉపాధి పనులకు వెళ్ళకూడదనే నిబంధన ఉన్నది కాబట్టి అటువంటి పేదలు ఉపాధి పనికి కాకుండా వ్వవసాయ కూలీకి వెలుతారు కాబట్టి అటువంటి వారికి అన్యాయం జరిగే పరిస్థితి ఉందని,దినిని సరిచేసి పేదలకు అందే విధంగా చేయలన్నారు.గ్రామ సభలు ఏర్పాటు చేసి నియోజకవర్గంలో అత్యంత పెదలకు ఇళ్ల ఎంపికను వర్థించే విధంగా ఎంపిక పక్రియ కొనసాగించాలన్నారు.ఈ కార్యక్రమంలో చిన్న మల్లయ్య,నాగరజు,రాజు,దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment