పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇళ్లస్థలాలు ఇవ్వాలి.
సిపిఎం మండల ఏరియా కార్యదర్శి పొదిల రామయ్య.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి
ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం నాగర్ కర్నూల్ మండల కమిటీ ఆధ్వర్యంలో పురపాలక సంఘం మేనేజర్ కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పొదిల రామయ్య నాగర్ కర్నూల్ పురపాలక సంఘ పరిధిలో ఉన్న గ్రామాలలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం మండల ఏరియా కార్యదర్శి పొదిల రామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేండ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా పదేండ్ల కాలాన్ని పదవులు కాపాడుకోవడానికి సరిపోయిందని ఆయన అన్నారు. అనేక గ్రామాల్లో ఇప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పునాదులకే పరిమితమయ్యాయి ఆయన అన్నారు. నూతన ప్రజా ప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అది అధికారంలోకి వస్తే అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం పథకాన్ని నీరుగార్చడమేనని ఆయన అన్నారు. నాగర్ కర్నూల్ పురపాలక పరిధిలో ఉన్న గ్రామాలు మరియు పట్టణంలో దాదాపు 5000 మంది కిరాయి ఇళ్లల్లో నివసిస్తున్నారని మరి ప్రభుత్వం ప్రకటించిన 3,500 ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికి చాలామందికి సొంత స్థలాలు లేక ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురి అవుతున్నారని కాబట్టి ప్రకటించిన ఇండ్ల శాతాన్ని వెంటనే పెంచాలని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇళ్ల స్థలాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు గుంపల్లి అశోక్ మధు సుల్తాన్ పాల్గొన్నారు