గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక చేయాలి.

గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక చేయాలి.

 

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్ నాయక్ 

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి 11):

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తి అయిందని,ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తామని ఇందిరమ్మ ఇల్లు ఎంపిక గ్రామాలలో గ్రామ కమిటీలే తుది నిర్ణయం అని చెప్పడంతో ఆ కమిటీ కాంగ్రెస్ పార్టీకి పరిమితం అయిందని, అలా కాకుండా గ్రామాలలో గ్రామ సభ పెట్టి అర్హులు కలిగినటువంటి జాబితా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఎం పార్టీ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కమిటీ సమావేశం మండల కేంద్రంలో ఎండి లాల్ మమ్మద్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి దేశ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే దాంట్లో పారదర్శకత ఉండాలని ఏ స్కీము అమలు చేసిన గ్రామసభ ద్వారానే ఎంపిక చేయాలని కోరారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంకా 40 శాతం మందికి రుణమాఫీ కానీ రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని, వారందరికీ కూడా రుణమాఫీ వెంటనే రెండు లక్షలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేనటువంటి నిరుపేదలందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని,అట్లాగే రైతు భరోసా జూన్ నవంబర్లో వేయాల్సిన రెండు దెబ్బల రైతు భరోసా ఇప్పటివరకువేయకపోవడంతో రైతులు ఆందోళన పరిస్థితిలో ఉన్నారని వెంటనే ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇచ్చిన హామీ మేరకు 15వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వము ఇచ్చిన హామీని అమలు చేయకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణ రూపొందించే పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి శంకర్ నాయక్, మండల కమిటీ సభ్యులు బాబర్, ఆంజనేయులు బాలు, కృష్ణయ్య, లక్ష్మణ్,రాయుడు, తదితరు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment