---Advertisement---

పట్టభద్రుల MLC ఎన్నికలలో OU విద్యార్ధి నాయకుడు పోటీ?విశ్వసనియా వర్గాల సమాచారం

---Advertisement---

పట్టభద్రుల MLC ఎన్నికలలో OU విద్యార్ధి నాయకుడు పోటీ?
విశ్వసనియా వర్గాల సమాచారం మేరకు చెవుల పరశురాం యాదవ్ (రాష్ట్ర అధ్యక్షులు విద్యార్థి సంఘం )రాబోయే మెదక్, నిజామాబాదు, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల MLC ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.గతంలో కామారెడ్డి MLA, జహిరాబాద్ MP కి బిసి మరియు విద్యార్థి సంఘాల తరపున పోటి చేశారు.ఇప్పుడు కూడా విద్యార్థులు, నిరుద్యోగులు పోటీలో నిలబడాలని చూచిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన అనుభవం,విద్యార్థుల సమస్యల మీద పోరాడుతున్న బహుజన బిడ్డ. రాజకీయ అవకాశం లభిస్తేనే బిసి కులాలు అభివృద్ధి చెందుతాయి అని బలంగా నమ్మే వ్యక్తి. R. క్రిష్ణయ్య (మాజీ రాజ్య సభ సభ్యులు, జాతీయ అధ్యక్షులు బిసి సంక్షేమ సంఘం) గారి శిక్షణతో రాజకీయ ఓనమాలు నేర్చుకొని తన వెంట ఉద్యమబాటలో నడుస్తూ అసెంబ్లీ,పార్లమెంట్ ముట్టడికి సైతం వెనకాడని వ్యక్తి.ఎ పార్టీ అధికారంలోకి వచ్చిన విద్యార్థి, నిరుద్యోగులకు చేస్తుంది మాత్రం శూన్యం అని ప్రశ్నించే గొంతులనే పట్టభద్రులు చట్ట సభల్లో కి పంపితే ప్రభుత్వాన్ని నిలదిషే అవకాశం, అభివృద్ధి ఉంటాయని విద్యార్థి మరియు నిరుద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.చట్ట సభలల్లో, విద్య, ఉద్యోగాలల్లో బిసిలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన EWS రిజర్వేషన్లతో ఈ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుండంతో బిసిలు రాజకీయంగా ఎదుగాలని బలమైన సంకలపం ఉన్నట్లుగా సమాచారం. అందులో భాగంగానే MLC గా బిసిలనే ఎన్నుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించాలానే తపనతో కులగనణ చెసి మా జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్స్ పెంచాలని బిసి కులసంఘాలు పట్టుపట్టాయి.దీనికి అనుకూలంగానే పోటీలో నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి.బిసిలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న పార్టీలకు ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని సంపద అంతా దోచుకొని గుప్పిట్లో పెట్టుకుంటున్న అగ్రకులాలకు పెను సవాల్ గా మారుతూ బరిలోకి దిగాలని ఆలోచిస్తూన్నట్లు కొన్ని వర్గాల ద్వారా అందిన సమాచారం.కొన్ని పార్టీల,అగ్రనాయకుల ఆలోచన లో పరశురాం యాదవ్ పేరు ఉన్నట్టు తెలుస్తుంది.పేర్లు ఖరారు అయ్యేవరకు వేచి చూడాలి అదృష్టం ఎవరిని వరిస్తుంది అన్నది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment