స్ఫూర్తి బుక్ ఆఫ్ రికార్డ్స్ డాక్టరేట్ అవార్డుల పండుగ..
– డాక్టర్ గంగి మల్లేశ్ ప్రముఖ సామాజికవేత్త..
కళాభారతి/ హైదరాబాద్, డిసెంబర్ 28 (తెలంగాణ కెరటం)
లీడర్ ఆఫ్ ద భారత్ గ్లోబల్ ఎన్జీవోస్ గ్లోబల్ సోషల్ వర్కర్స్ సోషల్ రిఫార్మర్ హానరి డాక్టరేట్ అవార్డ్స్ శర్మని 2024 సందర్భంగా ఏషియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ మరియు రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవో నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ రైట్స్ కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ అండ్ స్ఫూర్తి సకల కళా వేదిక వారి ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డుల ప్రధాన కార్యక్రమం కళాభారతి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గంగి మల్లేష్ ప్రముఖ సామాజిక, వ్యాపార వేత్త మాట్లాడుతూ.. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము ప్రజల కోసం నిరంతరం పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజికవేత్తలు ప్రజా అవసరాల రీత్యా అనుక్షణం తపించే వ్యక్తులకు ఈ యొక్క డాక్టరేట్ వరిస్తుందని అన్నారు. ముందు ముందు స్ఫూర్తి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ , సంస్కృతిగా కల్చరల్ అసోసియేషన్ ద్వారా మరెన్నో అవార్డుల ప్రధానం రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక చేయడం కోసం కసరత్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా డాక్టర్ గంగి మల్లేశ్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజాసంఘాలకు ప్రజలకు తనను నమ్ముకున్న కార్యకర్తలకు ప్రతిక్షణం అండదండగా ఉంటూ వారికి కావలసిన సేవలను అందిస్తూ నిరంతరం నిరాడంబంగా ప్రజల మన్ననులు గైకొంటున్న డాక్టర్ గంగి మల్లేశం, పనిచేయాలని దృక్పథం సాటి మనిషికి ఏదో చేయాలన్న తపన ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా అలవాటైందని ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. స్ఫూర్తి సొసైటీ ఆర్గనైజేషన్ ఎన్జీవో చేస్తున్నటువంటి సేవలను డాక్టర్ గంగి మల్లేశ్ కొనియాడారు. సమాజం పట్ల జరుగుతున్నటువంటి కడు నిరుపేదల పరిస్థితులు వాటికి అనుగుణంగా ప్రజల సుఖశాంతులు ప్రజలకు కావలసినటువంటి సదుపాయాల నిమిత్తం అలుపెరుగని పోరాటం చేస్తూ వస్తున్న తరుణంలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ వారు గుర్తించి నాకు ఈ డాక్టరేట్ ఇవ్వడం ఎంతో గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. స్ఫూర్తి ఎన్జీవో సంస్థ ముందు ముందు పలు రాష్ట్రాలకు మరియు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతూ అనేక కార్యక్రమాలు చేపట్టి సామాజికవేత్తలను సంఘ సేవకులను గుర్తించి వారికి అవార్డులు ఇస్తూ మరింత సేవా దృక్పథం తో పనిచేయడానికి ప్రోత్సాహం కల్పిస్తారని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ యొక్క అవార్డుల ప్రధానం డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా దేశం నలుమూలల నుంచి ప్రముఖ సామాజిక వేత్తలను గుర్తిస్తూ సమాజం పట్ల వారు చేస్తున్నటువంటి కృషిని గ్రహించి వారికి ఈ డాక్టరేట్ ప్రధానం చేయడం జరుగుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త డాక్టర్ గంగి మల్లేశం తెలిపారు. కార్యక్రమంలో స్ఫూర్తి ఇంటర్నేషనల్ ఎన్జీవో సిబ్బంది దేశం నలుమూలల నుండి గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.