---Advertisement---

విద్యా వ్యవస్థను నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే

---Advertisement---

విద్యా వ్యవస్థను నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే

 

ఎమ్మెల్యే పై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి

 

తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 14

 

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం లో మొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి గురుకుల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐఏఎస్ అని చెబుతున్నారు అసలు నీకు విద్యావ్యవస్థ పైన కానీ సమాజం పైన గాని అవగాహన లేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐఏఎస్ కాదు ఐపీఎస్ అనే విషయం తెలుసుకోకుండానే నువ్వు మాట్లాడడం సిగ్గుచేటు అని తెలిపారు. ఇక విద్యావ్యవస్థ విషయానికి వస్తే మీరు పరిపాలన చేసిన 70 సంవత్సరాలు నారాయణఖేడ్ కు ఏ ఒక్క గురుకుల విద్యాలయాన్ని గాని తీసుకొచ్చి పెట్టిన పాపాన పోలేరు అంతకముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు గురుకుల విద్యాలయాలు ఏర్పాటు కాగా మళ్లీ కేసిఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక నేను ఎమ్మెల్యేగా గెలిచాక నారాయణఖేడ్ నియోజకవర్గానికి 8 గురుకుల పాఠశాలను తీసుకువచ్చారని తెలిపారు. మేము తీసుకువచ్చిన గురుకుల పాఠశాలల నిర్వహణ చేతకాక ఇప్పటివరకు మెయిల్స్ చార్జీలు పే చేయక పిల్లలకు సరైన ఆహారం పెట్టక వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రి పాలు అవుతున్న నువ్వు పట్టించుకునా పాపాన పోలేదు అని నిలదీశారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఐదు మోడల్ స్కూల్ శాంక్షన్ అయితే మీ చేతకాన్ని తనం వల్ల రెండు మాత్రమే నిర్మించి మూడు మోడల్ స్కూళ్లను నిర్మింప చేతగాక వాటిని వాపోస్ పంపిన ఘనత మీకే దక్కుతుంది అని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన టైంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మరియు జూనియర్ కాలేజ్లలో పిల్లలు కింద నేలపైన కూర్చొని చదువుకునేవారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారికి కూర్చోవడానికి బెంచీలను సాంక్షన్ చేయించి తీసుకువచ్చింది నేను అని తెలిపారు. నీకు ఏ అర్హత ఉందని ఏ ముఖం పెట్టుకొని విద్యా వ్యవస్థ పైన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ ఎంపీటీసీలు ముజామిల్, శ్రీనివాస్ పటేల్, మాజీ సర్పంచ్ రాజు నాయక్,మాజీ ఉపసర్పంచ్ సిద్దు, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు అంజాగౌడ్ కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ,నాయకులు సురేష్, జ్ఞానేశ్వర్ కురుమ, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment