విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు .
మాజీ మంత్రి. గుంటకండ్ల జగదీష్ రెడ్డి .

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి

విద్యారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సమాజ నిర్మాణం లో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి ని పురస్కరించుకొని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీ ఎం యస్ టి ఎ ) సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సావిత్రిభాయి ఫూలె అవార్డ్స్ -2025 ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై జిల్లా వ్యాప్తంగా ఎంపికైన ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాళ్లకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే అన్నారు. తొలి మహిళా ఉధ్యాయురాలిగా ఆమె జీవితం అందరి ఆదర్శనీయమని అన్నారు. మహిళల చైతన్యంతోనే సమాజంలో పూర్తిస్తాయి అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
మహిళలు అన్నిరంగాలలో రానించాలని సావిత్రిబాయి ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు.
మహిళలను విద్యావంతులను చేయాలన్న మహాత్మా జ్యోతిరావ్ పూలే గొప్ప ఆలోచనతో ముందుగా తన సతీమణి నే చదివించి ఉపాధ్యాయురాలిని చేశాడని,
అయన మార్గంలోనే సావిత్రి బాయి ఎంతోమంది మహిళలను చైతన్య వంతుల్ని చేసిందని కొనియాడారు.
ఇంటిని చక్కదిద్దినట్టే సమాజాన్ని చక్కదిద్దడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అటువంటి మహిళా ఉపాధ్యాయురాళ్లను సత్కరించుకోవడం గొప్ప విషయమని తెలిపారు. మహిళా ఉపాధ్యాయులకు సన్మాన
కార్యక్రమాన్ని చేపట్టిన మోడల్ స్కూల్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
వచ్చే ఏడాది ఇటువంటి కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వంచుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సి పూల రవీందర్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చల్లమల్ల నర్సింహ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు దామెర శ్రీనివాస్, రాధాకృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, సౌజన్య, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment