పెడిమల్ల రాజు కుటుంబాన్ని పరామర్శించిన ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 14 : మన్నెగూడెంకు చెందిన కోరుట్ల పాత్రికేయులు పెడిమల్ల రాజు, ప్రభాకర్ ల మాతృమూర్తి గంగుబాయి అనారోగ్యంతో బాధపడుతు సోమవారం మృతి చెందగా, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ కోరుట్లకు చెందిన పలువురు పాత్రికేయులతో కలిసి శనివారం వారిని పరామర్శించారు. శనివారం మన్నెగూడెంలో పెడిమల్లబ్ల్ కుటుంబీకులను కలిసిన నాయకులు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకొని పెడిమల్ల గంగాధర్ వారి సోదరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట డాక్టర్ బి.సురేందర్, పాత్రికేయులు సామల్ల శ్రీనివాస్, ఉరుమడ్ల శ్రీనివాస్, హైమద్, కత్తిరాజు శంకర్, నాయకులు శనిగారపు రాజేష్, మనోజ్, శంభోజి మదు, మహారాజు, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.