జగిత్యాల జిల్లా స్థాయి అట్యా పాట్యా సెలక్షన్స్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 22 : సిఎం కప్ లొ భాగంగా జగిత్యాల జిల్లా స్థాయి అట్యా పాట్యా సెలక్షన్ ను ఆదివారం కోరుట్ల పట్టణంలోని వివేకానంద మిని స్టేడియంలో మనంగా నిర్వహించారు. క్రీడలలో సూమారు 100 మంది బాలబాలికలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడలలో ఉత్తమ ప్రతిభ చూపిన బాలుర జట్టు, బాలికల జట్టు డిసెంబర్ 31 నుండి జనవరి 02,వ తేదీ వరకు సరూర్ నగర్ ఈnస్టేడియం హైదరబాదులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని కె.రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అన్నం అనిల్, స్థానిక కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ, పెటా సెక్రటరీ ఎస్.అశోక్, అట్యా పాట్యా జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ వి.నవీన్ కుమార్, సెక్రటరి కొక్కుల రాజేష్, సంఘ బాద్యులు కె.విజయ్ కుమార్, జి.రవీంధర్, వి.రాజు, సిహెచ్ శంకర్, బి.వేణుగోపాల్, సాయి, శ్రీనివాస్, నవీశ్ సినియర్ క్రీడాకారులు పీఈటీలు, పిడీలు పాలోన్నారు.