---Advertisement---

*శాంతికి – కరుణకు మారుపేరు ఏసుక్రీస్తు*

---Advertisement---

*శాంతికి – కరుణకు మారుపేరు ఏసుక్రీస్తు*

తెలంగాణ కెరటం, మందమర్రి డిసెంబర్ 25,

శాంతి కరుణకు మారుపేరు ఏసుక్రీస్తు అని మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పెతస్థ మినిస్ట్రీస్ చర్చి లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓదెలు మాట్లాడుతూ.. ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో ఉండాలంటే యేసయ్య ద్వారా సాధ్యపడుతుందని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరీ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసు దయవల్ల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని యేసయ్య ను ప్రార్ధిస్తున్నారని పేర్కొన్నారు. పేదవారి పట్ల దయ చూపే దేవుడు యేసయ్య అని పేర్కొన్నారు. అనంతరం చర్చి ఫాదర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఏసు క్రీస్తు దయవల్ల ఈరోజు మనం అంత సుఖ సంతోషాలతో ఉంటున్నామని పేర్కొన్నారు. ఎక్కడైతే కష్టం బాధలు అశాంతి ఉంటుందో అక్కడ ఏసుక్రీస్తు ప్రత్యక్షమై వాటిని తొలగిస్తాడని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు నమ్ముకున్న వారికి ఎప్పుడు సుఖసంతోషాలే ఉంటాయని వారికి కష్టాలే రావాని
సూచించారు. ప్రతినిత్యం చర్చికి వెళ్లి ప్రార్థన చేయడం వల్ల మనకు మానసిక శక్తి పెరుగుతుందని ఆ సక్తితో మనం ఏదైనా సాధించవచ్చు అని అన్నారు .యేసు అంటేనే ప్రజలకు పెద్ద దిక్కు అని కొనియాడారు. ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయని యేసు చూపిన బాటలో నడుస్తూ ఉంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు ఓదెలను ఘనంగా సన్మానించి జ్ఞాపకం అందజేశారు.అదేవిధంగా మందమరి పట్టణ వ్యాప్తంగా చర్చిలలో ఉదయం నుండి సాయంత్రం వరకు చర్చి ఫాదర్ లు, ప్రజలు ఘనంగా ప్రార్ధన నిర్వహించారు. ఎక్కడ చూసినా చర్చలలో సందడి వాతావరణం నెలకొంది ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడిపారు. స్టేషన్ రోడ్ లోని చర్చిలో ఫాదర్ జాన్ ప్రత్యేక ప్రాధాన్ నిర్వహించారు. ఒకటవ జోన్ లోని చర్చిలో ఫాదర్ కొత్త సంవత్సర క్యాలెండర్లను విడుదల చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సొత్తుకు సుదర్శన్, మంకు రమేష్, ఎండి సుకూర్, సంఘీ సంతోష్, ఎర్ర రాజు, మాయ తిరుపతి, రంజిత్ గౌడ్, స్థానికులు తదితరులు, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment