గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 : కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో ధనుర్మసా ఉత్సవాలలో భాగంగా శనివారం జరిగిన గోదాదేవి కళ్యాణం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రాజేష్, వ్యవసాయమార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోయినపల్లి సత్యనారాయణ రావు, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, పుప్పాల ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాళ్ళ సత్యనారాయణ, కిసాన్ సెల్ బీసీ సెల్ మండల అధ్యక్షులు నర్సయ్య, లింబాద్రి, రవీందర్ రెడ్డి, చిట్టి బాబు, గంగాధర్ తదితరులు ఉన్నారు.