మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన జువ్వాడి కృష్ణారావు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్
మాజీ ప్రధాన మంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో శుక్రవారం జరిగిన సంతాప సభలో కృష్ణారావు మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా చేసిన సేవలు, తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఆర్థిక పటిష్ట భారత్ గా రూపాంతరం చెందడానికి కారకులయ్యారని అన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు దేశానికి ఎనలేని సేవ చేశారని అన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, ఇంతటి మేధావి మృతి భారతదేశనికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతమ్ రాజాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, నయీమ్, మ్యాకల నర్సయ్య, అన్నం అనిల్, పుప్పాల ప్రభాకర్ ఎంబేరి నాగభూషణం, వసీం, వసీద్, జిందమ్ లక్ష్మీనారాయణ, ఏ.ఆర్ అక్బర్, మున్ను, షేక్ మొహ్మద్, తెడ్డు విజయ్, ఎడ్ల రమేష్, బోయిని నాగరాజ్, సోగ్రాబి, ఎలిశెట్టి భూమరెడ్డి, బన్న రాజేష్, జాగిలం భాస్కర్, దండవేని వెంకటేష్, కోట గంగాధర్, ముజబిత్, అయూబ్, యూట్యూబ్ రాజు, రియాజ్, నేమురి భూమయ్య, చిట్యాల లక్ష్మీనారాయణ, రిజ్వాన్, సోహైల్ లింబాద్రి తదితరులు ఉన్నారు.