నవచేతన విజ్ఞాన సమితి పుస్తకాలయ బస్సును ప్రారంభించిన జువ్వాడి నర్సింగరావు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 29 : నవచేతన విజ్ఞాన సమితి, ప్రజాపక్షం దినపత్రిక సంచార పుస్తకాలయం బస్సును కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తకాలు చదవడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవచ్చునని, ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రజాపక్షం రిపోర్టర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ఏలేటి మహిపాల్ రెడ్డి, కౌన్సిలర్ ఏంబేరి నాగభూషణం, నాయకులు అన్నం అనిల్, చిట్యాల లక్ష్మీనారాయణ, పసుల కృష్ణ ప్రసాద్, ఎడ్ల రమేష్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయులు గంగుల రాంగోపాల్, సామల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.