జ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
-సమాజంలో మీడియా పాత్ర కీలకం
-ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి,
-గజ్వేల్ ఆర్డీవో వివిఎల్ చంద్రకళ
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 18,
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి,గజ్వేల్ ఆర్డీవో వివిఎల్ చంద్రకళ జ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక 2025వ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం గజ్వేల్ పట్టణ,నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.వారు మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజా సమస్యల పట్ల అనునిత్యం పోరాటాలు చేస్తూ,ప్రజా సమస్యలు వెలికి తీసి,వార్తల ద్వారా పరిష్కారం అయ్యే విధంగా చూస్తారని ప్రశంసించారు.ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలో దినపత్రికలు కీలక పాత్ర వహిస్తాయని వాక్యానించారు.జ్యోతి తెలుగు దినపత్రిక ప్రజలకు ఎంతో చేరువ అవుతూ,అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల పాత్రికేయులు పాల్గొన్నారు.