తెలంగాణ కెరటం నవంబర్ 28 ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి
సమ సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు అణగారిన వర్గాల ఆశా జ్యోతి ,మహాత్మ జ్యోతిరావ్ పూలే అని బిసి సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మ స్వామి,ధర్మారం మండల అధ్యక్షులు సాగంటి కొండయ్య అన్నారు గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్ ర్ చౌరస్తా లో మహాత్మాజ్యొతి రావ్ పూలే 134 వ వర్ధంతి సందర్బంగా బీసీ సంక్షేమ సంఘo అద్వక్షులు సాగంటి కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మ స్వామి, మండల అధ్యక్షులు సాగంటి కొండయ్య లు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న పూణే లో తల్లి జమున బాయి తండ్రి గోవిందరావు లకు జన్మిచాడు. సమాజంలో సగ భాగం ఐనా మహిళలు అభివృద్ధి చెందకుండ సమాజం అభివృద్ధి చెందదని పూలే నమ్మాడని అందుకే స్రీలు విద్యావంతులు కావాలని భావించాడని ,ఇతరులకు ఆదార్శంగా ముందు తన భార్య సావిత్రిని చదివించి, టీచర్ ట్రేనింగ్ కు పంపించారు. దేశంలొనే తొలి బాలికల పాఠశాలను 1848 లో ప్రారంభించారు..సమాజానికి చేసిన కృషిని చాటి చెప్పెందుకు 1888 మే 11 న పూణేలో పెద్ద బహిరంగ సభ జరిగింది.. వేలాది మంది ప్రజల సమక్షంలోనె జ్యోతిరావు పూలే కు మహాత్మా అనే బిరుదు సత్కారం పొందారు.. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పారాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మందపల్లి సత్యం,నార రమేష్,జంగ గట్టయ్య ,మంచర్ల లచ్చయ్య,పొతురాజుల తిరుపతి, అర్దవెల్లి అంజయ్య,కొండ తిరుపతి,ఎనుగంటి గంగయ్య,కంసాని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు