కాంగ్రెస్ లో చేరిన కలిగోట్ శ్రీనివాస్

కాంగ్రెస్ లో చేరిన కలిగోట్ శ్రీనివాస్

తెలంగాణ కెరటం ఆర్మూర్ ప్రతినిధి, జనవరి

వినయ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఏబీవీపీ జిల్లా ఎక్స్ కన్వీనర్ కలిగోట్ శ్రీనివాస్
ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఏబీవీపీ నిజామాబాద్ జిల్లా ఎక్స్ కన్వీనర్ కలిగోట్ శ్రీనివాస్ తన 50 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరామని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, పట్టణ ఉపాధ్యక్షులు కిరణ్ అల్జాపూర్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment