గురుకుల విద్యార్థులను పరామర్శించిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

గురుకుల విద్యార్థులను పరామర్శించిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

 

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 19 : పాము కాటుకు గురై కోరుట్ల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థులు అఖిల్, యశ్విథ్ లను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గురువారం పరామర్శించి, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లడుతూ సంవత్సర ప్రజా పాలన అని సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సంవత్సరం పూర్తవుతున్న విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైన విద్యా శాఖకు మంత్రిని కేటాయించి గురుకుల పాఠశాలలపై దృష్టి పెట్టాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాసాగర్ రావు వెంట బిఆర్ఎస్ నాయకులు దరిశెట్టి రాజేష్, ఫహీం, అతీక్, యాటం కృష్ణ, చీటి వెంకట్ రావు, పేర్ల సత్యం, చిత్తారి ఆనంద్ తదితర నాయకులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment