తెలంగాణ గల్ఫ్ బాధితులకు కల్వకుంట్ల కుటుంబం క్షమాపణ చెప్పాలి
– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు డిమాండ్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గల్ఫ్ బాధితులకు కల్వకుంట్ల కుటుంబం క్షమాపణ చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో శుక్రవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంతం నుండి గల్ఫ్ పోవలసిన అవసరం ప్రజలకు ఉండదని నమ్మబలికి, ఇంటికికొక ఉద్యోగం ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేశాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉత్తర తెలంగాణ నుంచి అత్యధికంగా గల్ఫ్ దేశాలకు ప్రజలు వలస వెళ్లారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ పాలసీ తీసుకొస్తామని ఆనాడు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో అత్యధికంగా వివిధ గల్ఫ్ దేశాల్లో మరణించగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అధికారిక ఉత్తరం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధితుల సమస్యను తెలియజేశామని అన్నారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాధితులు అందరికీ న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కోరుట్ల నియోజకవర్గంలో మరణించిన గల్ఫ్ బాధిత కుటుంబాలకు 05 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరు చేశారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గల్ఫ్ బాధితుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని, గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండ్రీ కొడుకులు అధికారాన్ని అనుభవించి ప్రజలను మోసం చేశారని అన్నారు. గల్ఫ్ పోయే పరిస్థితి ఉత్పన్నం కాదు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు 2014 నుండి అధికారం అనుభవించిన పది సంవత్సరాల లో మరణించిన కుటుంబాల ఇళ్లకు వెళ్లి ప్రతి కుటుంబానికి కల్వకుంట్ల సంజయ్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావులు క్షమాపణ చెప్పాలని జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పన్నాల అంజిరెడ్డి, జిల్లా బిసి సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, కౌన్సిలర్ సంగ లింగం, జిల్లా పడాల లచ్చయ్య,, సదుల వెంకటస్వామి, నల్ల రామరాజ్, ఎంబేరి సత్యనారాయణ చల్ల పురుషోత్తమ్చిట్యాల లక్ష్మీనారాయణ, తెడ్డు విజయ్ దశరథం పల్లపు అశోక్ బొల్లె అక్షయ్ తోట్ల మహేష్ బుస రాజేష్ తదితరులు పాల్గొన్నారు