పేదవారికి కళ్యాణ లక్ష్మి గొప్ప వరం.

పేదవారికి

కళ్యాణ లక్ష్మి గొప్ప వరం.

 

అర్హులైన వారందరూ

కల్యాణ లక్ష్మీ పథకాన్ని 

వినియోగించుకోవాలి.

 

చేగుంట-70 మందికి,నార్సింగ్-21

మొత్తం 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మీ పథకం ద్వారా 91,10,556-00 రూపాయలు పంపిణీ.

 

ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం మాది.

 

సంక్షేమ పథకాలలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు.

 

రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి జనవరి 18:

 

ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ పేర్కొన్నారు.మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం వడియారం గ్రామంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , తూప్రాన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి, చేగుంట తాసిల్దార్ సంబంధిత ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం 33 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రివర్యులు ప్రారంభించారు.మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలానికి చేరుకున్న మంత్రివర్యులు కొండా సురేఖ కు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళ్యాణ్ లక్ష్మీ షాది ముబారక్ పథకం పేదింటి ఆడపిల్లల పాలిట వరంగా భావించాలని,ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ప్రభుత్వలు మారినప్పుడు ఆ పథకాలను కొనసాగిస్తుంది అంటే అది మంచి పథకం గా భావించాలని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజివ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ,రైతు రుణమాఫీ, కార్యక్రమాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.ఆ పథకాలు ప్రజలకు తప్పనిసరి అవసరమని గుర్తించి..తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని కొనసాగించిందని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదవారికి ఎంతో ఉపయోగపడుతుందని. పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం అర్హులను ఆదుకుందన్నారు ఏ పథకమైన మొదలు పెట్టినప్పుడు కొంత సమస్య తలెత్తవచ్చునని, సమస్యలు పరిష్కరించుకొని ఆ పథకం క్రమీపి ఆచరణ దిశగా ముందుకు సాగుతుందన్నారు.మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ చెక్కులను ఇస్తుందన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాలుగు పథకాలు 26 నుండి అమలు అవుతాయని చెప్పారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ గ్రామాన అధికారులు తిరుగుతున్నారని రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకొని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అని వివరించారు. రైతు భరోసా సంవత్సరానికి 12 వేల రూపాయలు రెండు విడతలు ఇవ్వడం జరుగుతుందన్నారువ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న ప్రతి ఎకరాకి రైతు భరోసా అందిస్తామని చెప్పారు.సంక్షేమ పథకాలలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని వివరించారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఒక నియోజకవర్గానికి 3500 ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందన్నారు ఎస్సీ ఎస్టీలు ఉన్నచోట ఎక్కువగా ఇవ్వడానికి ప్రభుత్వ సిద్ధంగా ఉందని చెప్పారు. పేదవాళ్లలో కెల్లా పేదవాళ్లను గుర్తించి మొదట ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు రానివాళ్లు ఎమ్మార్వో కార్యాలయం కెళ్ళి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.గ్రామ సభలు పెట్టి వాస్తవాలు తెలుసుకొని అర్హులైన లబ్ధిదారులను ఇప్పిస్తామన్నారుఏ ఒక్క రూపాయి కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు అనేదే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు వివరించారు.రైతులకు రైతు భరోసా, చేనేతలకు పెన్షన్ ఇచ్చిన తరహాలోని కూలీలకుఇందిరమ్మ ఆత్మీయ భరోసా సత్ఫలితాలను ఇస్తుందన్నారు.గుంట భూమి లేకున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పారు . కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని ఈ 12 వేల రూపాయలు అందజేస్తాం అన్నారు. రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ ఇందిరమ్మ ఇండ్ల సెలెక్షన్ జరుగుతుందని తెలిపారు.చిన్న పొరపాటు జరగకుండా సంక్షేమ పథకాలు అమలయేలా పగడ్బందీగా చర్యలు చేపట్టామన్నారుపార్టీలకతీతంగా ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల జాబితా ఎంపిక చేయాలన్నారు.ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్న సంక్షేమ పథకాలు అందించలానే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ,పేదవారికి కళ్యాణ లక్ష్మి గొప్ప వరం అన్నారు గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది.ఇప్పటి ప్రభుత్వం కూడా దాని నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు.తెలిపారు.అనంతరం మంత్రి చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో2.16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి దుబ్బాక శాసనసభ్యులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ట్రాన్స్కో ఏ. శంకర్, ఏ.డి.ఈ శృతి, సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment