కామారెడ్డి జిల్లా ప్రోబిషన్ ఎక్సైజ్ అధికారి బి. హనుమంతరావు
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:
ఆదేశాల మేరకు కామరెడ్డి పట్టణంలో తేదీ 20-12-2024 నాడు విజయ దుర్గ భవాని హోటల్ పై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించగా అనుమతులు లేకుండా హోటల్ ప్రాంగణంలో మద్యం చేవిస్తున్నారని తెలిసినది. అందుకుగాను విజయ దుర్గ భవాని హోటల్ పై కేసు నమోదు చేయడం జరిగినది. అనుమతి లేని ప్రదేశ్ లలో మద్యం సేవించినచో కఠిన చర్యలు తీసుకోబడతాయని, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఫంక్షన్ హాల్లో గాని, హోటల్లో గాని, ఈవెంట్స్ నిర్వహించినప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఇట్టి దాడులో ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్ మరియు సిబ్బంది కే మైసరాజ్, కే దేవకుమార్, పాల్గొన్నారు.